పయనించే సూర్యుడు మార్చి 22, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సాహిత్య విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పుప్పాల సూర్య కుమారి కి ఉగాది సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉగాది పురస్కార కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సూర్య కుమారి అందుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి పురస్కారాలతో కళాకారులకు, సాహిత్య వేత్తలకు ఉత్సాహం కలిగి మరింత ఉత్తేజంగా సాహిత్య రచనలు చేస్తారని అన్నారు. ఈ పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని సూర్యకుమారి తెలిపారు. పుప్పాల సూర్య కుమారికి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం లభించడం పట్ల మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.