గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో… ఊహించని ఫలితాలు సాధించాం

స్వల్ప తేడాలతో మున్సిపల్ పీఠాన్ని పోగొట్టుకున్నాం కాంగ్రెస్ అభ్యర్థులకు గజ్వేల్ ప్రజలు అండగా నిలిచారు బిఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా ఖర్చు పెట్టలేకపోయాం... గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ కు కోటి వేతనం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 22 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించినట్లు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వల్ప తేడాలతో మున్సిపల్ పీఠాన్ని కోల్పోగా, బిఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా ఆర్థిక వనరులు సమకూర్చలేకపోయినట్లు చెప్పారు. కష్టపడిన కార్యకర్తలకే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వగా, ఓడిన అభ్యర్థులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువగా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండగా, మరో 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకాలేదని తెలిపారు. ఇప్పటి వరకు రూ కోటికి పైగా వేతనం, ఇతర అలవెన్సులు పొందిన కేసీఆర్ ను ప్రజలు అసహ్యించుకుంటుండగా, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ నేతలు జైలుకెళ్లడం ఖాయమని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు షరీఫ్, నేతలు సారిక శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *