ధర్మబద్ధ జీవనమే దీక్షల ఉద్దేశం.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 22 మామిడిపెల్లి లక్ష్మణ్ దైవ చింతనతో ధర్మబద్ధంగా జీవితం గడుపుతూ దుర్వ్యసనాలు తగ్గించుకోవడమే దీక్షల ఉద్దేశమని పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.రాయికల్ మండలం చింతలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం లో శనివారం ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న పలువురు యువకులు . ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా చెరుకు మహేశ్వర శర్మ మాట్లాడుతూ, మనిషి తాను అనుసరిస్తున్న జీవన విధానమును మరింత వృద్ధి చేసుకోవడానికి నియమముగా నడుచుకొను విధమును దీక్ష అంటారని తెలిపారు. హైందవ ధర్మంలో,ఆధ్యాత్మిక వృద్ధికి దైవ దీక్షలు అనుసరణీయమని చెప్పారు. దైవ చింతన ద్వారా మానసిక ఉన్నతిని సాధించి సమాజం లో ధర్మవంతులైన పౌరులుగా ఎదగడానికి అనుభవజ్ఞులైన గురువులు పండితులు మన పూర్వీకులు సూత్రీకరించినవి దీక్షలని వివరించారు. హనుమాన్ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, భవానీ దీక్ష ,సేవాలాల్ దీక్ష వంటి వాటి వల్ల యువతలో సేవా భావం సమైక్యత, ధర్మముగా జీవించడం అలవడుతుందని అన్నారు.ఏ పని అయినా ఒక నియమముగా, మండలం, అర్దమండలం, 41,21,11,5 రోజులు చేస్తే అదే అలవాటుగా మారుతుందని తెలిపారు. నియమబద్ధంగా, సంస్కారంతో భక్తిగా దీక్షలు తీసుకున్న వారు తాము చేసే వృత్తి లో ఉన్నతిని సాధిస్తారని దీక్షా స్వాములు విశ్వసిస్తారు .ఈ కార్యక్రమంలో గురు స్వామి అనుపురం గంగాధర్ ,అల్లాల అంజిత్, నర్సయ్య ,ప్రణయ్ సత్యం ఉదయ్ రఘు నారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *