భూపతిపూర్ పద్మశాలి సేవాసంఘానికి లక్ష రూపాయల విరాళం అందజేసిన డాక్టర్ వాసాల శ్రీధర్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 22 మామిడిపెల్లి లక్ష్మణ్ పద్మశాలి సేవాసంఘ అభివృద్ధికి ప్రముఖ వైద్యులు శ్రీమిత్ర హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ వాసాల శ్రీధర్ (యం.డి) తన వంతు సహకారంగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తన స్వగ్రామమైన భూపతిపూర్‌లోని సేవాసంఘం అభివృద్ధి కోసం, తన తండ్రి స్వర్గీయ వాసాల లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థంగా ఈ విరాళం అందించడం విశేషం. ఈ సందర్భంగా పద్మశాలి సేవాసంఘ సభ్యులు డాక్టర్ శ్రీధర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవాసంఘం అధ్యక్షులు కటుకం సతీశ్, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, సంఘ పెద్దలు మామిడాల నర్సయ్య, బోగ సత్తయ్య, వాసాల రమేష్, బండి గంగాధర్, కటుకం భూమనందం, వాసాల రాములు, బోగ లక్ష్మీనారాయణ, జక్కుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *