పాపన్నపేట : రంజాన్ వేళ .. ఘనంగా ప్రార్థనలు .

పయనించే సూర్యుడు మార్చ్ 22. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. శనివారం పాపన్నపేట రహదారి సమీపన,పలు గ్రామాలలో ఈద్గా ల వద్ద అల్లాహ్ కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థన లో రంజాన్ మాస విశిష్టతను మత గురువు వివరించారు. పేద,ధనిక తేడా లేకుండా అలింగనం చేసుకుంటూ,రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. పాపన్నపేటలో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *