తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి పలువురు విరాళం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 22 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జరుగుచున్న నిత్యాన్నదాన పథకమునకు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వాస్తవ్యులు బొగ్గవరపు చంద్రమౌళి నాగేంద్రం రూ.36,916/- రూపాయలు మరియు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వాస్తవ్యులు కుమారి ముత్తినేని ప్రత్యూష రూ.151 $ యూయస్ డాలర్స్ మరియు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వాస్తవ్యులు నల్లాని వెంకటనారాయణ కుమార్తె నల్లని స్నేహ రూ.10,111/- రూపాయలు మరియు జగ్గయ్యపేట మండలం గౌరవరం వాస్తవ్యులు మెణి రాము లక్ష్మీ రూ.10,116/- రూపాయలు మరియు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాచా వారి గూడెం వాస్తవ్యులు రూ.10,116/- విరాళముగా అందజేసియున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సిబ్బంది శ్రీ స్వామి వారి ప్రసాదములు అందజేయుట జరిగినది అని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతక్కి సాంబశివరావు తెలియజేసియున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *