పయనించే సూర్యుడు మార్చి 22 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శన, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద సంఖ్య లో రైతులు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటన లో కోరారు ఇప్పటికే మన జనగామ జిల్లా నుండే కాకుండా పలు ఇతర జిల్లాల నుండి నర్మెట్టలో వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటుచేసిన వివిధ ఎగ్జిబిషన్, స్టాల్స్ ను గత మూడు రోజులుగా పలువురు రైతులు సందర్శిస్తున్నరన్నారు అయితే ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రైతు భరోసా నిధుల విడుదల కూడా జరుగుతున్న సందర్భంగామన జిల్లా నుండి కూడా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని అందుకు సంబందించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేసారన్నారు జిల్లా లోని 12 మండలాల నుండి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో రైతులు ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యయన్నారు అదేవిధంగా జిల్లాలో గల 1,98, 072 మంది రైతులకు తొలి విడతగా ఒక ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతులు, మహిళా రైతులు, యువ రైతులు అభ్యుదయ రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు.