ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 22, (చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). రంజాన్ పండుగ సందర్భంగా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ మైనార్టీ శాఖ అధ్యక్షులు ఎస్.కే. సైదా గారి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.అనంతరం సైదా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను సాదరంగా ఆహ్వానించి, రంజాన్ సందర్భంగా తయారు చేసిన పాయసాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ నెల ఎంతో పవిత్రమైనదని, ఈ కాలంలో ఉపవాస దీక్షలు ఆచరించడం, పేదలకు దానం చేయడం, మతసామరస్యాన్ని పెంపొందించడం ఎంతో గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు.రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బందెల నాగార్జున, గ్రామ సర్పంచ్ తాళ్లూరి స్వప్న-రమేష్, మొదటి వార్డు సభ్యులు తోటకూరి హరీష్, కాంగ్రెస్ నాయకులు తోటకూరి సైదేశ్వరరావు, నరసింహారావు, మధిర నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వెర్పుల, జగన్నాధపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరువురి వెంకటేశ్వర్లు, బండారుపల్లి రంగారావు, మైనార్టీ నాయకులు ఎస్. హసేన్, జానీ తదితరులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *