పయనించే సూర్యుడు మార్చి 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈరోజు తమ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును లబ్ధిదారులైన చాందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ మరియు మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.