విలాసాగర్ గ్రామంలో ఘనంగా పవిత్ర రంజాన్ వేడుకలకు

ముఖ్య అతిథిగా హాజరైన విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య

పయనించే సూర్యుడు మార్చి 22 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా విలాసాగర్ గ్రామంలో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి,ఈ పవిత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు,ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు,ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య ని ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు,గ్రామంలో స్నేహభావం,ఐక్యతను మరింత బలపరిచిన ఈ వేడుకలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *