పయనించే సూర్యుడు మార్చి 22 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ ప్రతినిధి దుర్గం మోహన్: పవిత్ర మాసమైన రంజాన్ పండుగ పురస్కరించుకొని 19వ డివిజన్ లో శనివారం నాడు సాలెహునగర్ ఈద్గా కు నమాజ్ కు ముస్లిం కుల పెద్దలతో విచ్చేసిన కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ అలాం కు స్వాగతం పలికి పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు డివిజన్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు అలాగే ప్రేమ కరుణ మరియు సహనానికి ప్రతికగా నిలిచే ఈ పండుగ మన అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను మత సామరస్యం ఐక్యత ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ముస్లిం కుల పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు