మమ్మాయిపల్లి ట్రాక్టర్ డ్రైవర్ ఆకస్మిక మృతి – కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం

కుటుంబానికి 10,000 వేల రూపాయలు అందజేస్తున్న సర్పంచ్ సర్వజనమ్మ ఉప సర్పంచ్ రాము

పయనించే సూర్యుడు మార్చి 22 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తమ్మడి బాబు ఆకస్మికంగా మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఏటవాలి సరోజనమ్మ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కదిరె రాము, వార్డ్ సభ్యులు నక్క భాగ్యలక్ష్మి, తమ్మడి బాలయ్య, మేడమోని బాలకృష్ణ, నక్క రత్నమ్మ, బద్దుల నీలమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *