నూతన ఎస్సై కి టిడిపి నాయకుల సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 రిపోర్టర్ అభి మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ మారుతిని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అనుచరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నాయకులు, ఎస్ఐ మారుతికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, చిన్నతుంబళంకు చెందిన సిద్దప్ప గౌడ్, మాల శివ, బండి బసవరాజు, మాల రవి, వడ్డే ఎల్లప్ప, నజీర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్ఐ మారుతిని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. స్పందించిన ఎస్ఐ మారుతి, ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *