పయనించే సూర్యుడు మార్చి 23 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. శనివారం ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు. ఆదోని నియోజకవర్గం వీఆర్వో, సర్వేయర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో పారిశ్రామికంగా ఏర్పాటుకు 25% కేంద్రం వాటా ఇచ్చిందని దీనికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మని తెలిపారు.అదేవిధంగా విజయవాడకి వెళ్ళిన అనేకసార్లు చంద్రబాబు నాయుడు ని మరియు ఉప ముఖ్యమంత్రి వారిని , పారిశ్రామిక వేత్త టీజీ భారత్ ని అనేకసార్ ఆదోనిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినప్పుడు అక్కడ ప్రభుత్వ స్థలాలు చూసి మాకు ప్రపోజల్స్ పెట్టండని పెడితే దానికి తగ్గ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఆదోనిలో పెట్టడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్థానికులంగా మాట్లాడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఆదోనిలో పరిశ్రమలు తీసుకొచ్చి ఆదోని పారిశ్రామిక హబ్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.