ప్రపంచం లోనే ఓ మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్

పయనించే సూర్యుడు 23-3-2026 గొల్లపెల్లి మండలం ప్రతినిధి (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ నామస్మరణ కమిటీ సామజిక సేవ కార్యకర్త గంగాధర మధుసూదన్,ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమంలో గొల్లపెల్లి పట్టణానికి చెందిన మున్నూరు కాపు సంఘం పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు కట్ట మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కట్ట మహేష్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనాన్ని వివక్షతను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారని అన్నారు అంబేద్కర్, రాజ్యాంగం నిర్మాణం చేయడం వల్లనే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నామన్నారు అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్నూరు సంఘం సీనియర్ నాయకులు బోనగిరి మల్లారెడ్డి,సంఘము ఉపాధ్యక్షులు పడాల చిన్న సత్యం,సంఘం ప్రధాన కార్యదర్శి బోనగిరి పవన్,కోశాధికారి పడాల పెద్ద సత్యం,బోనగిరి వెంకటేష్,కొత్త తిరుపతి,ముదాం శ్రీనువాస్, కట్ట సత్తన్న,గంగుల యాదగిరి, భీమగారి చందు, ముద్దం సురేష్,భీమ శ్రీనివాస్, బోనగిరి వెంకటేష్ కందుకూరి మల్లేష్,కందుకూరి శ్రీను,జైన పాట కిషన్,పడాల తిరుపతి, పడాల సుదర్శన్,బోనగిరి నాగరాజ్,లక్కాకుల శ్రీను, కట్ట రవి, మరియు సంఘ సభ్యులు అనోజ్, బోనగిరి అనిల్ పడల రాజు,భీమ మహేష్,రాచూరి రత్నాకర్,గ్రామస్తులు శాతల్ల లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *