రాయపల్లిలో ఘనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం

* డీకే అరుణమ్మ ప్రత్యేక నిధులతో రాయపల్లిలో అభివృద్ధి పనులు_ బీజేపీ మండల అధ్యక్షుడు కాటేపాగ ఆనంద్ * ప్రజా సౌకర్యమే లక్ష్యం_ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ , ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్

పయనించే సూర్యుడు మార్చి 23, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండల పరిధిలోని రాయపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామంలోని దూళ్ళ బుచ్చిలయ్య ఇంటి (దిమ్మె) నుండి హరిజన వాడలోని నరిగె బాలరాజు ఇంటి వరకు నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు పనులను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు కాటేపాగ ఆనంద్, బీజేపీ జిల్లా నాయకులు పల్లె శేఖర్, అరుణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కాటేపాగ ఆనంద్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణమ్మ కేటాయించిన ప్రత్యేక నిధులతో ఈ రోడ్డు నిర్మాణం ,గ్రామాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యం కోసం, ఎలాంటి రాజకీయ బేదాభిప్రాయాలు చూడకుండా ప్రజల ఇబ్బందులను గుర్తించి, అత్యవసరమైన చోట్ల సిసి రోడ్ల నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు డీకే అరుణమ్మ కు గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్ప్రపంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ , వార్డు మెంబర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు , బీజేపీ మండల అధ్యక్షుడు, బీజేపీ జిల్లా నాయకులు, వార్డు మెంబర్లు , పంచాయతీ సిబ్బంది, విధ రాజకీయ పార్టీల నాయకులు , కాలనీ వాసులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *