సామాన్యులకు భారంగా మారిన చికెన్ ధర

కొండెక్కిన కోడి ధర

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 23 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,సామాన్యుల నుండి సంపన్నుల వరకు వారంలో ఒకరోజు చికెన్ తినడం అలవాటుగా మారింది. మటన్ తో పోల్చుకుంటే చికెన్ ధర సామాన్యులకు అందుబాటులో ఉండడం వల్ల ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారు. బందు మిత్రులు, పండగల వేళల్లో కోడి లేదా చికెన్ కొనుగోలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ తరుణంలో జిల్లాలో శనివారం చికెన్ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ కేజీ రూ.340, లైవ్ రూ.210, డ్రెస్సింగ్ రూ.310 వరకు పలుకుతోంది. కోళ్ల సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే ఈ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రేట్లు అమాంతం పెరగడం సామాన్యులపై భారంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *