గుడ్లనర్వలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన గ్రామ కమిటీ ఏర్పాటు

గ్రామ అధ్యక్షులు కొడిదల సాగర్ ఉపాధ్యక్షులు లేట్ల భీమారావు ఆర్ శ్రీశైలం

పయనించే సూర్యుడు మార్చి 23 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని యువకులు, పెద్దలు కలిసి అంబేద్కర్ యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి గ్రామ గౌరవ అధ్యక్షులుగా వట్టెం చెన్నయ్య, అధ్యక్షులుగా కోడిదల సాగర్, ఉపాధ్యక్షులుగా భీమారావు, రెడ్డపాకుల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, లేట్ల వేణుగోపాల్, కార్యదర్శిగా బి. సంపత్ కుమార్, కోశాధికారిగా రామగళ్ళ మన్యం, సహాయ కార్యదర్శిగా కే. రాజు, ప్రచార కార్యదర్శులుగా అంబటి మల్లేష్, వట్టెం శివకుమార్ ఎంపికయ్యారు. అదేవిధంగా కమిటీకి గౌరవ సలహాదారులుగా గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి, దేవరకొండ రామచందర్, మాజీ సర్పంచ్ కె. రాము, లేట్ల వెంకట్, లేట్ల ప్రశాంత్, డప్పు లక్ష్మణ్, వట్టెం శివకృష్ణ, లేట్ల అశోక్, డప్పు విజయ్ కాంత్, లేట్ల ఉదయ్ కుమార్ తదితరులు వ్యవహరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *