జాబ్ క్యాలెండర్ లో ఆదివాసుల ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రస్తావన లేదు

పయనించే సూర్యుడు మార్చి తేదీ 24 రూలర్ ప్రతినిధి బి బాసు ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ ముఖ్యమంత్రి హామీ అమలు ఎప్పడు చేస్తారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాల్లో ఆదివాసుల ఉద్యోగ,ఉపాధ్యాయ నియామక పోస్టు ప్రస్తావన లేకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసులకు అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీ 100% రిజర్వేషన్ కనీసం ప్రస్తావన చేయకపోవడం ఆదివాసులకు తీవ్రని అన్యాయం చేయడమేనని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక రిజర్వేషన్ చట్టం చేయాలని ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేసారు అరకువేలి గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బురిడీ దశరథ్ తో కలిసి పొద్దు బాలదేవ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం జరిగిందని హామీ అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన ఆదివాసీ నిరుద్యోగులు గత మెగా డీఎస్సీలో సుమారు 5 వేల ఉపాధ్యాయ పోస్టులు కోల్పోయారని దీని ఫలితంగా ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆదివాసీ నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురియ్యారని ఆదివాసీ ప్రాంతంలో ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో ఆదివాసీ ప్రత్యక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసి ప్రాంతంలోఆదివాసీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఐదవ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు లేకపోవడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేసి ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని 5వ షెడ్యూల్ ఏరియాలో సర్వ హక్కులు,అధికారాలు ఆదివాసులకు ఉన్నాయని ఉద్యోగ నియామకాల మాత్రం జనరల్ నోటిపికేషన్ ఇచ్చి గిరిజనేతరులకు ఇవ్వడం ఆదివాసుల హక్కులు చట్టాలు కాలరాయడమే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని 100 శాతం రిజర్వేషన్లు కల్పించి డీఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయా నియమాలు చేపట్టాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *