మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించక పోతే మున్సిపల్

కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం - బీజేపీ నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 24 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వినితా గుప్తా, తోవి నాగార్జున , మహదేవ్, గోపి, ఉషారాజ్ కలిసి మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ సమీపంలో జిబి కాంప్లెక్స్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో, అలాగే చిన్న మార్కెట్ ప్రాంతంలో మరియు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులు ఎక్కడికి వెళ్లాయో స్పష్టత లేకపోవడం, స్థలంలో ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల గౌరవం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వీలైనంత త్వరగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు.లేకపోతే ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ , చంద్ర రామకృష్ణ , మాధవి , ప్రశాంత్ , మహేష్ నాయక్ , నాగేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *