అన్నదాత సుఖీభవ,రైతన్న మీకోసం అనే కార్యక్రమం.

పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు మార్చ్ 24 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. ఆదోని నియోజకవర్గం సాదాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల గురించి ఈ సందర్భంగా వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, ముఖ్యంగా పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను ఉమాపతి నాయుడురైతులకు వివరించారు. అదనంగా రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సరఫరా విధానాలపై సమగ్ర సమాచారం అందించారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా భాయ్, రంగస్వామి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, ఎల్.ఎల్.సి చైర్మన్ రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, రంగన్న, జిందే శంకర్, బాబు నాయుడు, ఎక్స్ కౌన్సిలర్ అంజి, అయ్యన్న, గిడ్డయ్య, జేసీ బంగారయ్య, శ్రీరాములు,పాల్గొన్న గ్రామ నాయకులు రంగస్వామి, శేఖర్, మనోహర్,బిజెపి నాయకుడు రమేష్, జనసేన నాయకులు ఉమేష్,శ్రీకాంత్, మరెప్ప మల్లికార్జున, హుసేని, శీను, గంగన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *