పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ 24 రెటీనా సమస్యలతో బాధపడుతున్న 25 మందికి శస్త్రచికిత్సకు ఎంపిక. చోడవరం మండలం గౌరీపట్నం గ్రామంలో హెల్ప్ ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి (ఎచ్ ఎచ్ స్ వి) ఎన్ జి, గౌరి యూత్ మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి బాధితులు తరలివచ్చారు. ముఖ్య విశేషాలు: రెటీనా స్క్రీనింగ్: శిబిరంలో సుమారు 80 మందికి అత్యాధునిక పరికరాలతో రెటీనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్సలకు ఎంపిక: పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్రమైన రెటీనా సమస్యలతో బాధపడుతున్న 25 మందిని శస్త్రచికిత్స కోసం నిపుణులైన వైద్యులు ఎంపిక చేశారు. ఉచిత సేవలు: ఎంపికైన 25 మందిని తదుపరి చికిత్స నిమిత్తం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించి, అక్కడ వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సాయిలక్ష్మి నర్సింగ్ హోమ్ అర్డోపెడిక్ డాక్టర్లు డా. బండారు సత్యనారాయణ,డా. బండారు రుషికేశ్, అడ్వకేట్ కాండ్రేగుల డేవిడ్, శరగడం సిమ్ నుడు ,పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామనిఎచ్ ఎచ్ స్ వి ఎన్ జి వో చోడవరం మండలం కన్వీనర్ పొలిమేర రాము తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రెటీనా వంటి క్లిష్టమైన సమస్యలను గుర్తించి, వారికి చూపు ప్రసాదించేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎచ్ ఎస్ వి ఫౌండర్ మరియు అధ్యక్షులు ఆబోతు రమణ , గ్రామ సర్పంచ్ కోన లక్ష్మీ చంద్రరావు, ఎంపీటీసీ జగన్నాథరావు శంకర ఫౌండేషన్ క్యాంప్ కోఆర్డినేటర్స్ సతీష్ మరి ఇతర స్టాప్ పాల్గొన్నారు