భాజపా నాయకుల అక్రమ అరెస్టులు ఆప్రజాస్వామికం

పయనించే సూర్యుడు మార్చి 24 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం రామచంద్ర రావు రాష్ట్ర పార్టీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పాలకుర్తి నుండి బయలుదేరకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీలను నెరవేర్చాలని ప్రజల పక్షాన కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంటే నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం ఆప్రజాస్వామికం అని, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో గద్దెనెక్కడం జరిగిందని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరు గ్యారెంటీలు ఇప్పటికైనా అమలు చేయాలని లేనియెడల అనేకమైనటువంటి ముట్టడి కార్యక్రమాలు తీసుకుంటామని భాజపా నాయకులు ఎప్పుడూ కూడా అరెస్టులకు భయపడరని అవసరమైతే జైలుకు వెళ్లిన సరే 6 గ్యారంటీలు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరేవరకు కొట్లాడుతామని అన్నారు రైతు భరోసా పేరు మీద రైతులను నమ్మించి నట్టేట ముంచారని రైతులు కనీసం యూరియా లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు అరెస్టు అయిన వారిలో భాజపా రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్, జిల్లా కార్యదర్శి దుంపల సంపత్, జిల్లా నాయకులు శ్రీకాంత్ ,మండల నాయకులు ఇలబెల్లి యాకయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *