ఆంధ్ర ముంబై గా ఉన్న ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను గుర్తుచేసుకొని దీక్ష ప్రారంభం అతి చిన్న వయసులోనే దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన రాజ్ గురు, సుఖ్ దేవ్ , భగత్ సింగ్ లను స్ఫూర్తిగా తీసుకొని ఆదోని జిల్లా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆదోని జిల్లా జేఏసీ నాయకులు. పిలుపునిచ్చారు. రెండో ముంబై గా పేరుగాంచిన ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సోమవారం ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో భీమా సర్కిల్ లో 128 రోజు రిలే నిరా దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వై పి నాగరాజు, గోవింద్ రాజ్, కోదండ, సుజ్ఞానమ్మ, రామలింగ, గుమ్మల బాలస్వామి మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని గత 128 రోజులుగా దీక్షల చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకు లేదని విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం అమలు చేయని హామీలు ఇస్తూ అధికారం చేపట్టాక వాటిని విస్మరించడం తగదు అన్నారు. గతంలో యువగోళం పాదయాత్ర సందర్భంగా వలస కార్ల యొక్క వెహికల్స్ 200 వరకు లెక్క పెట్టుకున్నారని అన్నారు. అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తానన్నారు. నారా లోకేష్ ఆదోని జిల్లాకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే నేడు పాలకులు ఆదోని జిల్లా విషయం ముఖ్యమంత్రి దృష్టికి పోలేదని సాకలు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించి మంత్రాలయం, ఎమ్మిగనూర్, ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు. అధికారపక్షంలో ఉన్నటువంటి టిడిపి ,జనసేన, బిజెపి పార్టీ నాయకులు కేవలం వాళ్ళ యొక్క పదవుల దృష్ట్యా ఆదోని జిల్లా ఉద్యమంలో పాల్గొన్నారే తప్ప నిజంగా ఆదోని జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని ఆలోచన వారికి లేదనీ అది కాక *ఆదోని జిల్లా ఉద్యమాన్ని నిర్వార్యం చేయాలని ఒక్కొక్క పార్టీ ఒక్కొక ఏజెంట్ ని ఆదోని జిల్లా ఉద్యమంలో పాల్గొనే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. చివరికి ఆదోని పోరాటాన్ని మట్టికరిపించడానికి ప్రయత్నం చేసి చివరికి ఎటువంటి హామీ లేకుండా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఈ ఉద్యమాన్ని జిల్లా ప్రకటించేంతవరకు ప్రజల్లో చైతన్యవంతం తీసుకొని వచ్చి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తామన్నారు. 128 వ రోజు రిలే నిరాహార దీక్షలో సుభాష్ చంద్రబోస్ రామాంజనేయులు, రామకృష్ణ , హుసేని, వెంకోబు కూర్చొని ఆదోని జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *