బుట్టా శివ నీలకంఠకు రంజాన్ శుభాకాంక్షలు మండల ఐటి వింగ్ అధ్యక్షుడు ముల్లా రఫీ

మురహరి రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24,2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా ఎస్టేట్ బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో గోనెగండ్ల మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి విభాగ అధ్యక్షులు గంజహల్లి ముల్ల రఫీక్ మరియు గంజహల్లి నాయకులు నరసింహ ఆచారి, బోయ రమేష్ వేముగోడు మహేష్ రెడ్డి బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ ను శాలువాతో సన్మానించి మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరస్పరం ఆ లింగనం చేసుకొని, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్.బి.యస్ కాలనీ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కె.ఆర్. మురహరి రెడ్డి కార్యాలయంలో, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్ , 15వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్ , నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు నాయక్ ఎండి షరీఫ్, యువనాయకులు సోహెల్, బాసీద్ తదితరులు కలిసి కె.ఆర్. మురహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సన్మానించి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు తినిపించారు. బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ కె.ఆర్. మురహరి రెడ్డి లు వేరు వేరు గా మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధించిన మహత్తర సూత్రాలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. శాంతి, సహనం, కరుణ, సోదరభావం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించడం ద్వారా సమాజంలో ఐక్యత మరియు సౌభ్రాతృత్వం పెంపొందుతుందని తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షను కట్టుదిట్టంగా ఆచరించి, ఆత్మశుద్ధి సాధించి, అల్లాహ్ కృపతో ఆనందంగా పండగను జరుపుకోవడం ప్రతి ముస్లింలకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం మనకు నియమం, నియంత్రణ, సేవా భావం మరియు పరస్పర సహకారం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *