పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( తపస్) ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవ వీరులుగా గుర్తింపు పొందిన భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన తపస్ నాయకులు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజగుర్, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది అని, దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా భారతదేశంలో ప్రతి ఏటా మార్చి 23వ తేదీని ‘షహీద్ దివస్’ (అమరవీరుల దినోత్సవం) గా జరుపుకుంటాం అని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని కలిగి ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, వేముల శ్రీనివాస్,సిఆర్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు