భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పయనించే సూర్యుడు మార్చి 24, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని : దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా చింతకాని మండలం నేరడ గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు ఘనంగా సమర్పించారు. “మనుషుల మధ్య వివక్షలేని, శ్రమ దోపిడి లేని సమాజమే నా స్వప్నం” అని చెప్పిన భగత్ సింగ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బి కే యం యు మండల కార్యదర్శి గోగుల ఆదినారాయణ, గ్రామ శాఖ కార్యదర్శి షేక్ దస్తగిరి, సహాయ కార్యదర్శి మట్టా రవి, 2వ వార్డు సభ్యుడు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, పగిళ్లపల్లి పెద్దవెంకయ్య, మట్టా చిన్నసైదా, మట్టా నర్సింహరావు, అన్నపురెడ్డి పుల్లయ్య, అన్నపురెడ్డి లక్ష్మయ్య, అన్నపురెడ్డి మోహనరావు, శ్రీను, కనకపూడి నాగరాజు, షేక్ ఉప్పలయ్య, పగిళ్లపల్లి ఉమేష్, గణేష్, మట్టా వినయ్, పగిళ్ళపల్లి రాఘవులు, మట్ట నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *