భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం

సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్

పయనించే సూర్యుడు మార్చి 24 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ స్వాతంత్ర సమరయోధుడు విప్లవ పోరాటాలకు స్ఫూర్తి షహీద్ భగత్ సింగ్ అని, వారి ఆశయాల సాధనకు కృషి చేస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు. సోమవారం బిజీనాపల్లి మండల కేంద్రం లోని పూలె అంబేద్కర్ చౌరస్తా లో 95 వ వర్ధంతి సందర్బంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కొరకు 31సంవత్సరాల వయస్సు లోనే ఊరికంబాన్ని ఎక్కినా మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఒక కులం ఇంకొక కులాన్ని, ఒక మతం ఇంకొక మతం, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకొని సమాజం కోరుకున్న వ్యక్తి అని అన్నారు. నేటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం పెట్రేగి పోతుంది అని భగత్ సింగ్ స్ఫూర్తి తో దానిపై పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, శ్రీశైలం, మల్లేష్, రాజు, రమేష్, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *