పయనించే సూర్యుడు మార్చి 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఈనెల 25వ తారీఖున అనగా (బుధవారము)రోజు ఉదయం 9 గంటల నుంచి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్పెషలిస్ట్ వైద్యులచే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక గారు మాట్లాడుతూ నిపుణులైన డాక్టర్లు గ్రామాలకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు నిపుణులైన వైద్యుల సలహాలు సూచనలు ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని తెలియజేశారు 25 జరిగే వైద్య శిబిరం నందు స్త్రీ వైద్య నిపుణులు చిన్న పిల్లల వైద్య నిపుణులు ఎముకలు /కీళ్ల వైద్య నిపుణులు దంత వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్ మొదలగు డాక్టర్లు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాధారణ ఆస్పత్రి నుంచి వచ్చి ఇట్టి క్యాంపును నిర్వహిస్తున్నారు కాబట్టి బిజినపల్లి మండల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ప్రియాంక సూచించారు