లట్టుపల్లి గ్రామంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరేపల్లి శివలీల చంద్ర గౌడ్

పయనించే సూర్యుడు మార్చి 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఈరోజు నూతన సీసీ రోడ్ల పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మరేపల్లి శివలిల చంద్ర గౌడ్ సీసీ రోడ్ల నిర్మాణం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొని పనులను ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, ఉపసర్పంచ్ అనేమోని శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ గడ్డం రామచంద్రయ్య, వార్డ్ మెంబర్లు తిమ్మక సునీత, తిరుపతయ్య, గౌసియా బేగం, పాలమూరు జాంగిర్, ముధం శివ యాదవ్, మాజీ వార్డ్ నెంబర్ పంతుల జియాజి, రాజేందర్ గౌడ్, ఇగ్రాం రం బాధ శ్రీనివాసులు, రామ్మూర్తి, జంగయ్య గౌడ్, శేఖర్ రెడ్డి, సురేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *