ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

పయనించే సూర్యుడు మార్చి 24 కరీంనగర్ న్యూస్: మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్ద ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు . ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆర్డిఓ మహేశ్వర్ నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *