పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 రిపోర్టర్ అభి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. వరాజారెడ్డి పాల్గొన్నారు. సోమవారం గ్రామంలోని రైతులతో సమావేశమైన నాయకులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. రైతులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.