పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 రిపోర్టర్ అభి పెద్దకడుబూరు మండలంలో గ్యాస్ సరఫరాపై ఉన్న అపోహల నేపథ్యంలో తహసీల్దార్ గీతా ప్రియదర్శిని సోమవారం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, గ్యాస్ సరఫరా విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. సరఫరా ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఎటువంటి అవకతవకలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఏజెన్సీ లైసెన్సును కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.