బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు

అక్రమ అరెస్టులు అప్రజాస్వామీకం బిజెపి మండల అధ్యక్షుడు: బంగారు మహేష్

పయనించే సూర్యుడు, మార్చి 24, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. అసెంబ్లీ ముట్టడికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలు ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టులు బచ్చన్నపేట మండలంలో జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉదయమే బిజెపి మండల నాయకులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో అధ్యక్షుడు బంగారు మహేష్,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సద్ది సోమిరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు మరియు నాయకులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ప్రజల తరఫున ఉద్యమాలు ప్రజా పోరాటాలు చేపడుతామని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటన అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *