పయనించే సూర్యుడు, మార్చి 24 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రామ్గూడలో మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనే ని రఘునందన్ రావు పుట్టినరోజు సంద ర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వ కంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రఘునందన్ రావు గారు ప్రజల సేవలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్,అరుణ్ గౌడ్,సుమన్,రంగస్వా మి,నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.