ముమ్మిడివరంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

పయనించే సూర్యుడు మార్చి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలి రామ్ హెడ్గేవార్ జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం విష్ణాలయం నందు నిర్వహించిన ఉగాది ఉత్సవంలో ముందుగా ఆయనకు ఆధ్య సర్ సంఘ్ ఛాలక్ ప్రణామ్ సమర్పించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ బెల్లపు కొండ వీరభద్ర రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని, నీటిని వృధా చేయరాదని, సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన “పంచ పరివర్తన” సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పర్యావరణ పరిరక్షణ ,స్వదేశీ భావన, పౌర విధులు అనే ఐదు అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భముగా ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్ నుండి ఆంజనేయస్వామి ఆలయం వరకు ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు అందరూ ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో పాల్గొని ఒక క్రమ పద్ధతిలో వారు ర్యాలీగా నడుస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో గాలిదేవర నరసింహమూర్తి (బుల్లి), పెన్మత్స గోపాల కృష్ణంరాజు , గొలకోటి వెంకటరెడ్డి గ్రంధి నానాజీ, రెల్లు గంగాధరం నంద్యాల నరసింహస్వామి బి. లక్ష్మీనారాయణ పొత్తూరి మూర్తిరాజు సలాది శ్రీనివాసరావు ఎస్ఎస్ఎఫ్ బొంతు కనకారావు,గని శెట్టి వెంకటేశ్వరరావు సన్నిధి రాజు వీరభద్ర శర్మ దంగుడు బియ్యం శ్రీనివాసరావు, చోడిశెట్టి రమేష్ జనిపెల్ల దుర్గాప్రసాద్ పేరాబత్తుల రామకృష్ణ తటవర్తి నాగరాజా రావు విత్తనాల రవితేజ కుడిపూడి దుర్గాప్రసాద్ కుడిపూడి సూర్య ప్రకాష్ అద్దంకి గౌరీ శంకర్ రెడ్డి రమణారావు పొత్తూరి సత్తిబాబురాజు రెడ్డి రామకృష్ణ, సఖిరెడ్డి శ్రీను సుంకర నాగేశ్వరరావు కొండేపూడి శ్రీనివాసరావు సానబోయిన రాంబాబు పుసులూరి బుజ్జి , మట్ట సూరిబాబు రెడ్డి చిన్న,ఏలూరి రాంబాబు పొత్తూరి సత్తిబాబు రాజు రేపు సింహాచలం పాలెపు రామకృష్ణ ఏడిద దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *