మార్చి 23-అమర వీరుల త్యాగ దినం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) మార్చి 24 మార్చ్ 23 మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే రోజు మరువలేని, మరపురాని రోజు ఓ తరుణ యువకుడు తన జీవితాన్ని, తన స్వప్నాలను, తన భవిష్యత్తును దేశం కోసం త్యాగం చేసిన రోజు భయమనే పదానికి అర్థమే తెలియని వీరుడు ఉరికంబం ఎదుట నిలబడి కూడా చిరునవ్వుతో ఉరి తాడును పూలమాలలా స్వీకరించిన ధీరుడు “భగవంతుడా… నాకు మళ్లీ జన్మ ఇస్తే విప్లవ కారుడిగానే పుట్టనివ్వు” అనే చివరి కోరికతో తన ప్రాణాన్ని దేశానికి అర్పించిన మహానుభావుడు ఆ అమర వీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ అత్యల్ప వయస్సులోనే 24 సంవత్సరాలకే నూరేళ్ల జీవితం చేసే సేవను చేసి చూపించారు వారి ఆత్మ గళం ఇప్పటికీ ప్రతి యువకుడి రక్తంలో మారుమ్రోగుతోంది వారి త్యాగం ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శక్తిగా నిలిచింది మనము నేడు స్వేచ్ఛగా శ్వాసిస్తున్న ప్రతి క్షణం వెనుక ఆ మహావీరుల రక్తబిందువులు ఎన్నో ఉన్నాయి అలాంటి అమర వీరులకు శతకోటీ వందనాలు వారి త్యాగాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదు వారి ఆశయాలను, దేశభక్తిని మన జీవితాల్లో ఆచరించడం… అదే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *