ఉచిత డ్రోన్ టెక్నాలజీ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -24 ఉచిత డ్రోన్ టెక్నాలజీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం -3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్,అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు.పదవ తరగతి, ఆపై చదువు చదివిన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల నిరుద్యోగ యువతి, యువకులకు ఉచితంగా డ్రోన్ టెక్నాలజీ శిక్షణ ఇవ్వబడునని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు.సింగరేణి రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల సింగరేణి ఉద్యోగుల పిల్లలు, ప్రభావిత ప్రాంతాల, పరిసర గ్రామాల నిరుద్యోగ యువతి, యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక వృత్తి శిక్షణ కేంద్రం (జి.వి.టి.సి.) కార్యాలయంలో తేది:30-03-2026 లోపు స్వయంగా హాజరై దరఖాస్తులు అందజేయాలని అన్నారు.నిరుద్యోగ యువతి, యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *