దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలు అనుసరణీయం

పయ నించే సూర్యుడు మార్చ్ 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన విద్యావేత్త,దొమ్మేటి వెంకట రెడ్డి ఆశయాలు అనుసరణీయమని ఏపీ మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు పేర్కొన్నారు, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయనకు నివాళులర్పించారు.దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సమాజంలో విద్యాభివృద్ధికి, ఐక్యత కోసం విశేషంగా కృషి చేశారన్నారు.కోనసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి పలు పాఠశాలలు స్థాపించారన్నారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించారని,శెట్టిబలిజ జాతిపితగా ప్రఖ్యాతి చెందారన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.యువగళం పాదయాత్రలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మరో హామీ నెరవేర్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఓ రవి కిరణ్,జడ్పిటిసి నేలకిషోర్, ఎంపీపీ కోలాట సత్యవతి సత్యం, నాయకులు నడింపల్లి సుబ్బరాజు,చెల్లి సురేష్,ఇసుకపట్ల వెంకటేశ్వర రావు,కొప్పిశెట్టి ఆనందరావు, శీలం సూర్యనారాయణ, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పసల నాయుడు, పిల్లి ప్రసాద్,మోకా అప్పాజీ,డిప్యూటీ ఎంపిడిఓ నున్న శంకర్ నారాయణ, కార్యాలయ పరిపాలన అధికారిణి సంఘమిత్ర, నాయకులు కాండ్రేగుల సత్య ప్రసాద్,దండుప్రోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వర రావు,కముజు లక్ష్మీ రమణ రావు,వాసంశెట్టి రాజేశ్వర రావు,వనచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *