పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 25, తల్లాడ రిపోర్టర్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 95 వ వర్ధంతి సందర్భంగా తల్లాడ మండల కేంద్రంలో టియుసి ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరంపరాయి దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా దురాక్రమణాలకి యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదామని భగత్ సింగ్ 95వ కామ్రేడ్ భగత్ సింగ్,రాజ్ గురు, సుద్దేవ్ లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగాటియుసిఐ జిల్లా కార్యవర్గసభ్యులుషేక్ లాల్మియామాట్లాడుతూ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 23 ఏళ్ల వయసులోనే పోరాడి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన ఆ మహావీరుల స్ఫూర్తితో ఇవాళ ప్రపంచ దేశాలపై యుద్ధాల పేరుతో తమ దురాక్రమణాలను కొనసాగిస్తున్న అమెరికా సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఆనాడు భగత్ సింగ్ స్వతంత్రం అంటే పాలకులు మారడం కాదని పరిపాలన విధానం మారాలని చెప్పారని తెల్లవాడు పోయి నల్లవాడు రావడం స్వతంత్రం కాదని, బానిస బ్రతుకులు పోవాలని, ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలని అదే నిజమైన స్వతంత్రం అని, ఇవాళ అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కేవలం తమ అధిపత్యాన్ని చలాయించడానికి మాత్రమే అని, ఇజ్రాయిల్ తో కలిసి ఒక దేశ అధ్యక్షుడు చంపడం ఆ దేశం పై విచ్చలవిడిగా బాంబు దాడులు చేయడం, ఇది శాంతికి వ్యతిరేకమని ప్రతి దేశానికి తమ సార్వభౌమాధికారం ఉంటుందని, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని, ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ అమెరికాకి తొత్తుగా మారి ట్రంపు చెప్పిన ప్రతిదానికి వత్తాసు పలుకుతున్నారని, మిత్ర దేశమైన ఇరాన్ ని కాదని, ఇజ్రాయిల్ కి మద్దతు పలకడం ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ సంపదలు రాకుండా ఆగిపోవడం, దేశంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల కొరతకు కారణమైందని, ఈ కారణంతో గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై అధిక భారం మోపారని, వీటన్నిటికీ కారణం అమెరికా యుద్ధం మాత్రమే అని, ట్రంప్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుగదేవుల వర్ధంతి సభలను మార్చి 23 నుండి 30 వరకు వాడవాడల జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ తల్లాడ బ్రాంచ్ కమిటీ నాయకులు. సిహెచ్ నరేష్ రామారావు గాంధీ చందు నాగులు కృష్ణయ్య శ్రీను నరసరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.