పయనించే సూర్యుడు మార్చి 25 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం గోడమూలకు గత జిల్లా కలెక్టర్ డ్వాక్రా గ్రూపు మహిళలు పాలమాకుల చిన్న మంజుల పోత్కనూరి విజయలక్ష్మికు ఇందిరా మహిళా శక్తి పథకంలో ఏర్పాటు చేసిన టీ స్టాల్ మిల్క్ పార్లర్లను స్థానంలో వారి దుకాణాలు నడుపుకునే విధంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సహకరించాలని వేధింపులకు పాల్పడవద్దని పేద అమాయక మహిళలను ఇబ్బందులపాలు చేయొద్దని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సిపిఎం జనగామ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వారికి చిరు వ్యాపారాలు తోపాటు వ్యాపార వాణిజ్య రంగాలలో మహిళా కేంద్రంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని కార్యక్రమం చేపడతావున్నారు దానిని అంతర్భాగంగా జనగామ కలెక్టరేట్ కార్యాలయం గోడ మూలకు ఇద్దరు పేద మహిళలకు డి ఆర్ డి ఏ లోను ఇచ్చి ఆరు నెలల క్రితం స్టాళ్లు ఏర్పాటు చేసి వారికి బతకమని గత కలెక్టర్ అవకాశం ఇస్తే ఇవాళ కొత్తగా వచ్చిన సందీప్ కుమార్ జా జిల్లా కలెక్టర్ వాటి తొలగించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి వేసవికాలం ముంచుకొస్తా ఉన్నది చెరువుకుంటలలో నీరు అడుగంటుతున్నాయి వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో కూలీలకు సరి అయిన వేతనం రావడం లేదు జనగామ పట్టణంలో ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నీటి వ్యాపారం జోరుగా సాగుతుంది.ప్రజలకు సురక్షితమైన మంచినీరు మున్సిపాలిటీ అందించలేకపోతోంది. జనగామ పట్టణంలో చేపట్టిన సుందరీకరణ పనులు తీవ్రమైన నాణ్యత లోపంతో ఉన్నాయని అవి మూడు సంవత్సరాలు నిండాకముందుకే ఎక్కడికి అక్కడ కూలిపోతున్నాయి. దోమలు కోతుల సమస్య తీవ్రంగా జిల్లాలో ఉంది.పంటలు రైతులు పండించలేని పరిస్థితి ఏర్పడ్డది. అలాగే ప్రజల పైన చిన్న పిల్లల పైన మహిళల పైన కోతులు దాడులు పెరిగాయి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తనడకగా నడుస్తుంది అనేకమందికి ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో మౌలిక వసతులకు పంచాయతీలలో డబ్బులు లేక తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు.ఇలా అనేక సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం కోసం కలెక్టర్ కృషి చేయాలి కక్ష సాధింపు ధోరణి అదే రకంగా సమస్య తీసుకువచ్చేటువంటి ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం కలెక్టర్ స్థానానికి ఉందాతనంగా ఉండదని అలాగే సహచర వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులను చిన్న చూపు చూడడం వారిని వేధింపులకు ఇబ్బందులకు గురి చేయడం వల్ల జిల్లా అభివృద్ధి కాదని ఆటంకంగా ఉంటుందని అన్ని తరగతుల ఉద్యోగులను కలుపుకొని పనిచేయాలని సూచించారు. కలెక్టర్ తన పద్ధతిలో వైఖరిలో మార్పు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు జనగామ జిల్లా అంటేనే చైతన్యంతో నిండుకుని ఉండదని ఇక్కడ నియంత స్వభావం ఆధిపత్య భావజాలంతో వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదని కలెక్టర్ పద్ధతి పై తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు ఈసమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య సాంబరాజు యాదగిరి బొట్ల శేఖర్ సింగారపు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ ఎండి అజారుద్దీన్ పొత్కనూరి ఉపేందర్ బోడా నరేందర్ ఎండి షబానా బెల్లంకొండ వెంకటేష్ చిట్యాల సోమన్న గంగాపురం మహేందర్ మునిగల రమేష్ తదితరులు పాల్గొన్నారు