పాసుబుక్ఉందిహక్కు ఉందికానీ సహాయం లేదు రైతు ఆవేదన

"రైతు కష్టాలను పట్టించుకోని ఏవో సాయికిరణ్ ఏఈఓ అఖిల"

పయనించే సూర్యుడు మార్చి 25 రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ రైతు వేదికలో ఓ రైతు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బయటపెట్టాయి. కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు పంచం రాములు (తండ్రి గాలయ్య) రైతుబంధు పథకం చివరి రోజు కావడంతో తన పాస్‌బుక్ తీసుకొని రైతు వేదికకు చేరుకున్నాడు. రాములకు మొత్తం 31 గుంటల భూమి ఉండగా, అందులో 18 గుంటలు అమ్ముకోవడంతో ప్రస్తుతం 13 గుంటల భూమి మిగిలి ఉంది. అదే పాస్‌బుక్‌లో వన్-బి నమోదులు ఉన్నప్పటికీ, కొత్త పాస్‌బుక్ లేకపోవడం మరియు సర్వే నెంబర్ నమోదు కాలేదని అధికారులు ఎంట్రీ చేయడానికి నిరాకరించారు. సరైన మార్గదర్శకత్వం ఇవ్వకుండా ఏఈఓ అఖిల రైతును ఏవో కార్యాలయానికి పంపగా, అక్కడి నుంచి ఏవో సాయికిరణ్ డిప్యూటీ ఎమ్మార్వో కార్యాలయానికి పంపించారు. అయితే, డిప్యూటీ ఎమ్మార్వో జహీరుద్దీన్ పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. అనంతరం జహీరుద్దీన్ మాట్లాడుతూ, రైతుకు సంబంధిత టెక్నికల్ సమస్య ఉన్నప్పటికీ కొత్త పాస్‌బుక్ లేకపోయినా రైతుబంధు పథకానికి అర్హుడేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు వేదిక – ఏవో కార్యాలయం – ఎమ్మార్వో కార్యాలయం మధ్య తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు మళ్లీ రైతు వేదికకు చేరుకునే సరికి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కార్యాలయానికి తాళం వేసి ఉండటం గమనార్హం. ఈ విషయంపై రిపోర్టర్లు ఫోన్ చేసినా అధికారులు స్పందించకుండా కాల్ కట్ చేసినట్లు తెలిసింది. రైతుబంధు దరఖాస్తు చివరి రోజు కావడంతో తనకు లభించాల్సిన ప్రయోజనం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతు పంచం రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. తెలియని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పి తన సమయాన్ని వృథా చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *