పయనించే సూర్యుడు మార్చి 25 దండేపల్లి దండేపల్లి మండలంలో హనుమాన్ దీక్ష స్వాములు ఘనంగా నిర్వహించిన హనుమాన్ శోభ యాత్ర లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనడం జరిగింది. శోభ యాత్ర దండేపల్లి మండలం మ్యాదరిపేట్ గ్రామం హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభం అయ్యి ముత్యంపేట హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. ఈ హనుమాన్ శోభ యాత్రలో రఘునాథ్ వెరబెల్లి మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టడం జరిగింది. శోభ యాత్ర ముగిసిన అనంతరం ముత్యంపేట దుర్గ ఫంక్షన్ హాల్ లో హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది అనంతరం సామూహిక హనుమాన్ భీక్ష స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ శోభ యాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామం అని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలని అన్నారు. హనుమాన్ దీక్ష స్వాములు పేద ఎత్తున ఈ శోభ యాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బందెల రవి గౌడ్, పత్తిపాక సంతోష్, ఎంబడి సురేందర్, గోపతి రాజయ్య, మోటపలుకుల తులసి, బోడకుంటి వెంకటేష్, పిట్టల అశోక్, గాడికొప్పుల సురేందర్, బోడ సత్యనారాయణ, ముత్తె అనిల్, ముత్తె వెంకటేష్, ముత్తె వెంకటేష్, నలిమెల మహేష్, సిపిరిశెట్టి శ్రీనివాస్ మరియు తతిదరులు పాల్గొన్నారు