కమ్యూనిస్టు యోధులు కామ్రేడ్ వీకే వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి మార్చి 25 పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ వీకే వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి జాఫర్ పేర్కొన్నారు. మండలంలోని వేములపాడు గ్రామంలో కామ్రేడ్ వీకే వెంకటరామిరెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు వికె ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం ఆవరణంలో , మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అభిమానులు రైతులు కార్యకర్తలు కమ్యూనిస్టు యోధుడు దివంగత కామ్రేడ్ వీకే వెంకటరామిరెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి అబ్దుల్ రజాక్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి జాఫర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ కామ్రేడ్ వీకే వెంకటరామిరెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు ఉద్యమంపై ఆకర్షితులై అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ లో క్రియాశీలకంగా పనిచేశారు యాడికి మండలంలోని వేములపాడు గ్రామ పంచాయతీ సర్పంచుగా సొసైటీ సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారని, భూస్వామ్య పెత్తందారులకు ఆ ప్రజాస్వామిక పాలకులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో ముందు వరుసలో నిలిచారన్నారు అమరజీవి కామ్రేడ్ వీకే ఆదినారాయణ రెడ్డి గారి స్ఫూర్తితో ఆ కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో భాగమైందన్నారు. మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదాతలు 72 మంది రక్తదానం చేశారు. అనంతరం స్వచ్ఛంద సేవకులు, సేవా కార్యక్రమాలు పలు సేవలు అందించిన వారందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాడపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య సీనియర్ నాయకులు ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి యాడికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మార్పు డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి పెద్దవడుగూరు మండల కార్యదర్శి వెంకటరాముడు యాదవ్, సిపిఐ నాయకులు శ్రీరాములు, ఓబి రెడ్డి, నీలూరు లక్ష్మయ్య సర్పంచు ఓంకార్ మ్మ శ్యామ్ సుందర్ నాయుడు, జూటూరు బషీర్, గుత్తి కార్యదర్శి రాందాస్ నారాయణ చిన్న కుల్లాయి రెడ్డి జూటూరు అర్షద్ కుల్లాయి రెడ్డి సాంబశివుడు, రసూల్ వీకే అభిమానులు సిపిఐ నాయకులు రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *