బీఆర్ఎస్ కు మరో షాక్

కాంగ్రెస్ లో చేరిన కొత్తపల్లి సర్పంచ్ శోభారాణి కండువా కప్పిన కవ్వంపల్లి

పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/25 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి: సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలింది. ఇటీవలనే బీఆర్ఎస్ కు చెందిన పర్లపల్లి గ్రామ సర్పంచ్ సూరం స్వప్న తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు పర్లపల్లి గ్రామానికి చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన కార్యాలయంలో శోభారాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుండటం, నిధుల మంజూరులో ఎలాంటి వివక్షత చూపించకపోవడం వంటి చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, బీఆర్ఎస్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. మూడున్నర కోట్ల రూపాయల నిధులతో డ్రైనేజీ, మంచినీటి పథకం పనులను వచ్చే ఏప్రిల్ మాసంలో చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం పెంచాలని, అలాగే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్ శోభారాణిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు గోదారి తిరుపతి, కవ్వంపల్లి యువ సేన జిల్లా అధ్యక్షుడు నోముల అనిల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా నాయకుడు పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *