పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 25 వత్సవాయి మండలం అకాల వర్షాలకు, తీవ్రమైన పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని వత్సవాయి మండలం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన వత్సవాయి మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు ఈ నెల 18వ తేది బుధవారం సాయంత్రం వత్సవాయి మండలంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన వర్షంతో కూడిన ఈదురు గాలులు సుమారు ఒక గంట పాటు రావటం జరిగినది. ఈ ప్రభావం వలన వత్సవాయి మండలంలోని రైతులు ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొద్దిరోజులలో వరి చేతికొస్తుందని, కోతకు సిద్ధమైన రైతులు అకాల వర్షంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వడ్లు రాలిపోయి వట్టి కంకులు మాత్రమే పొలంలో మిగిలాయి. వడ్లు మొత్తం కూడా పొలంలో రాలి ఈ గాలులు రైతుకు ఆవేదనను మిగిల్చాయి. అలానే మొక్కజొన్న మొత్తం కూడా వరిగి భూమి మట్టం అయింది. పాలపొట్ట దశలో ఉన్న మొక్కజొన్న పూర్తిగా నాశనం అయింది. అలానే చేతికంది వచ్చిన పంట కూడా వర్షం, గాలి వలన సగం దిగుబడి తగ్గి రైతులు కోలుకోలేని ఉన్నారు. మిర్చి రైతులు కళ్ళాలలో ఆరబోసిన కాయ తడపటం, అలానే పొలంలో కోయని కాయ రాలిపోవటం. ఈ విధంగా మిర్చి రైతులు కూడా నష్టపోయారు. కావున మేము రైతు పక్షాన ప్రభుత్వం వెంటనే రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎన్యూమరేషన్ చేయించి, నష్టపోయిన రైతులను పంటలను గుర్తించి వారిని నష్టపరిహారం మొక్కజొన్న, వరి రైతులకు ఎకరాకు రూ.50,000/ఇచ్చి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనగోలు కేంద్రాలు: – ప్రభుత్వం తక్షణం మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400/- కు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్న ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.1500/- కు మాత్రమే దళారీలు రైతుల దగ్గర కొంటున్నారు. రైతులు ఇప్పటికీ చేతికి వచ్చిన మొక్కజొన్నను భద్రపరుచుకొనే స్థలం లేక కొందరు, అప్పుల బాధతో కొందరు దళారీలకు తెగనమ్ముకొంటున్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర రూ.2400/- లభించక పోవటం వలన రైతులకు క్వింటాకు సుమారుగా రూ.1000/- నష్టం వస్తుంది కావున మొక్కజొన్న రైతులను వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మండలం రెవిన్యూ అధికారి ద్వారా ప్రభుత్వాన్నికి కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్ రావు నియోజకవర్గ పంచాయితీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి, మండల రైతు విభాగ అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ, కొలికపోగు వెంకటేశ్వర్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు మెట్టుకొలు నరేష్,ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు లేలా నాగేంద్ర రెడ్డి, మండల యువజన విభాగ అధ్యక్షులు కొట్టె నగేష్, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజ్జి, చిరుమామిళ్ల రాంబాబు, నెల్లూరు నారాయణ, సోమిరాజ్,మేడి వెంకీ, అంభోజీ గోపీచంద్,సురేష్, బత్తుల రామారావు, ఏడుకొండలు,తదితరుల మండల నాయకులు పాల్గొన్నారు.