
పయనించే సూర్యుడు మార్చి 25, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం ఫిషర్ మాన్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో మంగళవారం రోజు నిర్వహించిన ఆర్ ఏ ఎం పి ప్రోగ్రామ్ లో జెడ్ఈడి (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ ) అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈ) ల నాణ్యతను మెరుగుపరుచుకొని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్ఈడి కన్సల్టెంట్ చిట్టూరి పవన్ వీరేష్, జెడ్ ఈ డి సర్టిఫికేషన్లు, ముఖ్యంగా సిల్వర్ మరియు గోల్డ్ స్థాయిలు, వాటి ద్వారా లభించే ప్రయోజనాల గురించి వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డిఐసి) జనరల్ మేనేజర్ గణపతి, టెక్నాలజీ అప్‌గ్రడేషన్, బ్యాంకింగ్ సదుపాయాలు మరియు ఎం ఎస్ ఎం ఈ లకు లభించే వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమగ్రంగా వివరించారు. ఐపీఓ రాజేష్ కూడా జెడ్ఈడి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏ జెడ్ క్వాలిటీ డెవలప్మెంట్ కంపెనీ ఏపీ ఎం ఎస్ ఎం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏ పి ఎం ఎస్ ఎం ఈ డి సి) మరియు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి డి ఐ సి జెడ్ ఎమ్ గణపతి, ఐ ఓ పి రాజేష్, ఏ జెడ్ క్వాలిటీ డెవలప్మెంట్ కంపెనీ సీఈవో కళ్ల జగపతి, జెడ్ఈడి కోఆర్డినేటర్ చిట్టూరి పవన్ వీరేష్, ఆదిత్య, ముడసల సూరిబాబు, మనోహర్, సంతోష్, దివాకర్ మరియు తధితరులు పాల్గొన్నారు.