పయనించే సూర్యుడు మార్చి 25, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పశ్చిమాసియా యుధ్ద నేపధ్యంలో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ ఏమైందని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలపై పశ్చిమాసియా యుధ్దం తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. మాటకు ముందు వెనుక విజనరీ అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు యుధ్దం వల్ల జరిగే తదనంతర పరిణామాలపై ఎందుకు దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ లభించక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్ బంకుల్లో గంటల పాటు వేచి ఉంటే గాని డీజిల్ పెట్రోల్ దొరకడం లేదని ఆటో, క్యాబ్ డ్రైవర్లు పస్తులు ఉంటున్న పరస్థితి దాపురించిందన్నారు. కొందరు కూటమి నేతల కనుసన్నల్లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క ప్రభుత్వ భూములను పప్పుబెల్లం లా పంచిపెడుతున్న మరో పక్క గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించడం సిగ్గు చేటన్నారు నాగఃమణి. ప్రతీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఇప్పుడు సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. ప్రజలు నిత్యవసర వస్తువుల లభించక ఇబ్బందులు పడుతుంటే విజనరీ బాబు గారి ప్రభుత్వంలో మద్యం మాత్రం 24 గంటలు లభిస్తుందని ఎద్దేవా చేసారు. ఇటువంటి కష్ట సమయంలో ప్రజల వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 2019-2022 మధ్య ప్రపంచాన్ని వణికించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టం దరి చేరకుండా కాపాడిన ఘనత అప్పటి సిఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కరోనా సమయంలో ఇఫ్పటి ప్రభుత్వం ఉంటే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయ్యేదని నాగమణి పేర్కొన్నారు..