పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చ్ 25.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ప్రతినిధి జె. నాగరాజ) క్షయ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఎంపీడీవో లీల మాధవి మండల వైద్యాధికారిని మోనాలు అన్నారు ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన చౌడేపల్లి లో మండల ఆరోగ్యశాఖ సచివాలయ అధికారులు కలసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి పై పరీక్షలు నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈj కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ ఎంపీడీవో కార్యాలయం ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు సచివాలయ అధికారులు పాల్గొన్నారు