పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 25 రిపోర్టర్ అభి కౌతాళం మండల కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కురువ రంగన్న కుటుంబాన్ని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా బంటకుంట గ్రామానికి చెందిన సర్పంచ్ గోపాల్ రెడ్డి తండ్రి మృతి చెందగా, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వెంకట రామిరెడ్డి, కౌతాళం సర్పంచ్ పాల్ దినకర్, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.